లాయర్ అవుతానని మద్రాస్ లా కాలేజీ లో చేరి నిర్మాతగా మారిన త్రివిక్రమ రావు గారు. విజయ లక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానేర్ మీద పలు విజయవంతమయిన సినిమాలు నిర్మించిన త్రివిక్రమ రావు గారు వైజాగ్ లో సినిమా ఎక్సిబిటర్ గ ఉండే వారు. సినిమా మీద మక్కువ తో సినీ నిర్మాణం చేపట్టాలి అనుకున్న ఆయనకు, కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావటం తో, అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన త్రివిక్రమ రావు లా చదువుతానని మద్రాస్ లా కాలేజీ లో చేరారు. కాలేజ్ లో అయితే చేరారు కానీ క్లాస్ లో కాలు నిలిచేది కాదు.
ఒక నలుగురు స్నేహితులను బుట్టలో వేసుకొని తనకు బదులుగా అటెండెన్స్ చెప్పే ఏర్పాటు చేసుకొని, అయన డైరెక్టర్ సి.ఎస్. రావు దగ్గర అసిస్టెంట్ గ చేరిపోయారు యెన్.టి.ఆర్. నటించిన వాల్మీకి చిత్రానికి పని చేసారు.ఆ తరువాత కొంత కాలానికి 1976 లో నిర్మాతగా మారి శోభన్ బాబు గారి తో మొనగాడు అనే సినిమా నిర్మించి విజయం సాధించారు. 1976 నుంచి 2001 వరకు దాదాపుగా సినీ పరిశ్రమలోని అందరు హీరోలతో పలు విజయవంతమయిన సినిమాలు నిర్మించారు త్రివిక్రమ రావు గారు. బద్రి చిత్రం తో పూరి జగన్నాథ్ ను డైరెక్టర్ గ పరిచయం చేసారు త్రివిక్రమ రావు గారు.