
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా తన సినీ కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. సింగిల్ వుమెన్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు తెలుసు. గతంలో నాకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేదు. ఓసారి తమిళ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ డైరెక్టర్ తీరు నాకు నచ్చలేదు. చాలా అసౌకర్యంగా అనిపించి ఆ సినిమాకు నో చెప్పేశా..
దీంతో నాపై వాళ్లు కేసు పెట్టారు. నాపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించారు. నన్ను టార్గెట్ చేసి మానసికంగా వేధించారు. ఆ టైంలో నేను ఎవరికీ చెప్పలేదు. ఎవరినీ సాయం అడగలేదు. ఇంటికి వచ్చి రూమ్‌లో కూర్చుని ఏడ్చేశా. కానీ మళ్లీ ఆలోచించా. ఓ టీ తాగి రిలాక్స్ అయ్యా. ఇలాంటి సంఘటనలు మనల్ని మరింత బలంగా మారుస్తాయి. ఈ సంఘటన కొవిడ్‌కు ముందు జరిగింది.’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. తన జీవితంలోనూ కఠిన పరిస్థితులు ఉన్నాయని… వాటిని దాటుకుని ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు లావణ్య త్రిపాఠి..!!
