
ఇకపై రొమాన్స్ కు దూరంగా ఉంటానని చెబుతుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు అన్ని వాయిదా పడ్డాయి. సినీతారలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీనితో సోషల్ మీడియా వేదికగా అభిరామానులతో టచ్ లో ఉంటూ సమయాన్ని గడుపుతున్నారు. తాజాగా నటి లావణ్య త్రిపాఠి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ లాక్ డౌన్ తరువాత షూటింగ్ లు మొదలు కానున్నాయి. కొన్ని భయాలు కూడా వెంటాడుతున్నాయి. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ చేయడం అనేది పూర్తి భిన్నంగా ఉండబోతోంది. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తాం. ఇక రొమాంటిక్ సన్నివేశాలకు వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తా అంటూ చెప్పుకొచ్చింది.
 
					 
					
