మోహన్ బాబు కుమార్తె లక్ష్మి మంచు , అమెరికన్ టెలివిజన్ ధారావాహిక లాస్ వేగాస్‌తో హాలీవుడ్ లో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె సరస్వతి కుమార్ పాత్రను పోషించింది. లక్ష్మికి నటిగా, నిర్మాతగా, టెలివిజన్ ప్రెజెంటర్ గా విభిన్న రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటోంది. 4 సంవత్సరాల వయస్సులోనే తన నట జీవితాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు 20 చలన చిత్రాలతో పాటు USలో కొన్ని టెలివిజన్ షోలకు పని చేసింది. ఆమె చివరిసారిగా 2021లో నెట్‌ఫ్లిక్స్ పిట్ట కథలులో కనిపించింది. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా, మంచు లక్ష్మి సినీ పరిశ్రమలో తాను ఎదుర్కున్న సెక్సిజమ్, టైప్ క్యాస్ట్, కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.
బ్యాంకింగ్, నటన లేదా IT పరిశ్రమ ఎక్కడి నుంచి వచ్చినా ఇలాంటి ఇబ్బందులు మహిళలు ఎదుర్కొంటున్నారు. నాకు చాలా మంది మహిళలు వివిధ పరిశ్రమల నుండి వచ్చిన వారు తెలుసు. వారితో సంభాషిస్తున్నప్పుడు ఇలాంటి విషయాలు చెబుతుంటారు. నేను కూడా ఎదుర్కొన్నాను.. మోహన్‌బాబు కూతురినైనా, సినీ పరిశ్రమలో పుట్టి పెరిగినా నాకూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఇవన్నీ నాక్కూడా జరుగుతాయని మొదట్లో నేను అనుకోలేదు. అయినా వాటి నుంచి తప్పించుకుని నటిగా తానేంటో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటానని చెప్పింది. అంతేగాని అవకాశాల కోసం ఎవరి దగ్గరా చేయి చాచటం కానీ, వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కానీ చేయనని చెప్పుకొచ్చింది