in

lady superstar Nayanthara still regrets doing Suriya’s Ghajini

హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాది ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకున్న నయనతార అటు నార్త్ లోను మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అందుకే అటు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్ చేస్తూనే.. స్టార్‌ హీరోల చిత్రాలలో నటిస్తూ అందరిని అలరిస్తుంది.

కాగా, ‘గజిని’ సినిమాలో నటించడం తన జీవితంలోనే ఒక చెత్త నిర్ణయం అని స్టార్ హీరోయిన్ నయనతార అన్నారు. “గజిని సినిమాలో ముందు అనుకున్న విధంగా నా పాత్రను తెరకెక్కించలేదు. ఈ విషయంలో నేను ఎవరిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిని గుణపాఠంగా స్వీకరిస్తా” అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా..సూర్య, ఆసీస్ జంటగా తెరకెక్కిన గజిని మూవీ 2005లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో నయనతార కీలకపాత్ర పోషించారు..!!

Paruvu – web series

Vijay Devarakonda to romance Sai Pallavi?