in

Lady Superstar Nayanthara joins Yash’s ‘Toxic’!

KGF సిరీస్‌ విజయాల తర్వాత యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్‌’  గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో  కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నయనతార, హ్యూమా ఖురేషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం యశ్‌తో కలిసి నయన్‌ సెట్లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం వీళ్లిద్దరిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు చిత్రవర్గం నుంచి సమాచారం..

రెండో షెడ్యూల్‌ను యూకేలో చిత్రీకరించనున్నారట. ఈ సినిమాలో కీలక భాగం అక్కడే చిత్రీకరణ చేసుకోనుందని.. దీనికోసం దాదాపు 150రోజులకు పైగా సుదీర్ఘ షెడ్యూల్‌ను ప్లాన్  చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. విజయవంతమైన ఆంగ్ల సిరీస్‌ ‘పీకీ బ్లైండర్స్‌’ ప్రేరణతో గీతూ ఈ కథను సిద్థం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో యశ్‌ పవర్‌ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న విడుదల కానుంది..!!

Samantha’s Malayalam debut with Mammootty!

‘Jagadeka Veerudu Athiloka Sundari’ clash with 3 movies!