
కొందరికి ఎంత కష్టపడ్డా ఫలితం దక్కదు.. మరికొందరికి మాత్రం తెలియకుండానే లక్కీ ఛాన్స్ వచ్చేస్తుంది. ఈ తరహా ఘటనలకు ఉదాహరణ అంటే మోనాలిసా భోంస్లే అని చెప్పాలి. ఈ ఏడాది జరిగిన మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు, పూసలు అమ్ముతూ కనిపించి అందరినీ ఆకర్షించింది. ఆమె సహజమైన అందం, చిరునవ్వుకు అంతా ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
మోనాలిసా హీరోయిన్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో “లైఫ్” అనే సినిమా ప్రారంభోత్సవం అయ్యింది. ఈ చిత్రానికి శ్రీను కోటపాటి దర్శకత్వం వహించనుండగా.. చరణ్ సాయి హీరోగా నటిస్తున్నాడు. చరణ్ గతంలో క్రష్, ఇట్స్ ఓకే గురు సినిమాల్లో హీరోగా చేశారు. ఈ సినిమాని శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్ మీద అంజయ్య విరిగినేని, ఉషా విరిగినేని నిర్మిస్తున్నారు. గతంలో ఆదిసాయికుమార్‌తో ‘లవ్ కే రన్’, ధనరాజ్, తాగుబోతు రమేష్‌తో ‘ఏకే రావు పీకే రావు’ మూవీలతో శ్రీను డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు..!!
