ఫిక్షనల్ స్టోరీస్‌లో హీరోయిన్గా కనిపించడం వేరు. బయోపిక్‌లో రియల్ లైఫ్ క్యారెక్టర్ పోషించడం వేరు. మొదటిది చాలామంది చేస్తారు. రెండోది చేసే చాన్స్ మాత్రం కొందరికే వస్తుంది. ఇప్పుడు కృతీ సనన్ని ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. బాలీవుడ్ లెజెండరీ యాక్ట్రెస్ మీనా కుమారి పాత్రలో ఆమె కనిపించబోతోంది. ‘మిమి’ చిత్రంలో సరొగేట్ మదర్‌గా మెచ్యూర్డ్ నటనను ప్రదర్శించాక నటిగా చాలా మెట్లు ఎక్కింది కృతి. రీసెంట్గా వచ్చిన ‘బచ్చన్‌పాండే’లో కూడా తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఫిదా చేసిందామె.
ప్రస్తుతం ప్రభాస్‌తో ‘ఆదిపురుష్’, కార్తీక్ ఆర్యన్‌తో ‘షెహ్జాదా’, చిత్రాలు చేస్తోంది కృతి. ఇప్పుడు మీనా కుమారి బయోపిక్‌లో నటించే చాన్స్ దొరికింది. ముప్ఫయ్యేళ్ల పాటు బాలీవుడ్‌ను ఏలారు మీనా. ఎమోషన్స్‌ని అంత బాగా మరెవరూ పండించలేరని పేరు. శాడ్ సీన్స్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన దిలీప్ కుమార్ కూడా మీనా అంత బాగా యాక్ట్ చేయలేకపోతున్నానని ఫీలయ్యేవారట. రాజ్ కుమార్ సైతం ఆమెతో నటించేటప్పుడు డైలాగ్స్ మర్చిపోయేవారట.
ట్రాజెడీ క్వీన్, చైనీస్ డాల్, ఫిమేల్ గురుదత్, సిండ్రెల్లా ఆఫ్ ఇండియన్ ఫిల్మ్స్ అంటూ ఎన్నో బిరుదులు ఉన్నాయి మీనా కుమారికి. పైగా మంచి రచయిత్రి, సింగర్ కూడా. తన లైఫ్‌లో కూడా ఎంతో ట్రాజెడీ ఉంది. భర్త కమల్ ఆమ్రోహీతో విడిపోయిన తర్వాత తాగుడుకి బానిసై, చివరికి లివర్ సిర్రోసిస్‌తో చనిపోయారు మీనా. కమల్ మరో భార్య కొడుకు తాజ్దార్ ఇప్పుడీ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నట్లు తెలిసింది. త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా రానుందని సమాచారం. ఏదేమైనా అంత గొప్ప నటి లైఫ్ స్టోరీలో నటించడం, ఆమె పాత్రలో కనిపించడం ఏ హీరోయిన్‌కైనా పెద్ద చాలెంజ్. మరి ఈ పాత్రని కృతి ఎంత బాగా పోషిస్తుందో చూడాలి!