ఇటీవల ఎంతోమంది సార్ సెలబ్రెటీస్ బెట్టింగ్ ప్రమోషన్స్ యాప్ ల ద్వారా వివాదాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అలాగే.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ కూడా..ఓ మద్యం బ్రాండ్ ప్రమోషన్స్ తో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మ్యాజిక్ మూమెంట్స్ టాప్ వోడ్కా బ్రాండ్ కు అంబాసిడర్‌గా కృతి సనన్ సెలెక్ట్ అయింది. అంటే కష్టపడకుండానే యూత్ తాగడానికి ప్రోత్సహిస్తుంది..
మ్యాజిక్ మూమెంట్స్ అంటే అనుభూతిని సొంతం చేసుకోవడం.. మ్యాజిక్ కుటుంబంలో చేరడం చాలా స్పెషల్ గా అనిపిస్తుందని.. ఉత్సాహంగా ఉందని..మా భాగస్వామ్యం సరదాగా శక్తితో నిండి ఉంటుందని కృతి సనన్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. కాగా.. ఈమె గతంలో మన తెలుగు సినిమాల్లో నటించడమే కాదు.. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సరసన.. ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించింది. సినిమా రిజల్ట్‌ను పక్కన పెడితే..ఈ సినిమాలో సీతగా ఓ పౌరాణిక పాత్రలో నటించిన ఆమె.. ఇప్పుడు వోడ్కా తాగమంటూ ప్రచారం చేయడం ఎవరికీ నచ్చడం లేదు..!!