గతేడాది రిలీజ్ అయిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీతగా నటించింది. ఈ సినిమాలో తన అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఈ అమ్మడు తనకంటే పదేళ్లు చిన్నవాడైన ఓ అబ్బాయి తో రొమాన్స్ చేస్తుందంటూ.. వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై రియాక్ట్ అయిన కృతిసనన్ మాట్లాడుతూ..
తనకంటే పదేళ్ల చిన్న వ్యక్తితో డేటింగ్ చేస్తున్నాడు అంటూ వచ్చిన రూమర్స్ తనను ఎంతగానో బాధించాయని వివరించింది. యూకే కు చెందిన కబీర్ బహ్రియాతో కృతి డేటింగ్ చేస్తుందంటూ.. కబీర్ తోనే కలిసి ఆమె పుట్టినరోజు వేడుకలను చేసుఉకందంటూ..వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా స్పందించిన కృతి నా గురించి తప్పుడు వార్తలు రాసినప్పుడు నాతోపాటు.. నా కుటుంబం కూడా ఎంతో ఇబ్బంది పడుతుందని, బాధపడుతుందని, దానివల్ల వచ్చే సమస్యలను మేమంతా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది..!!