హోటల్ రూమ్స్ లో కస్టమర్స్ కు తెలియకుండా కెమెరా లు పెట్టి వీడియోస్ తీసి తరువాత వారిని బ్లాక్ మెయిల్ చేయడం మనం ఇది వరకే చూసి ఉంటాము..ఇలాంటి ఒక ట్రాప్ నుండి బయట పడింది అందాల కృతి..మ్యాటర్ లోకి వెళ్తే..పవన్ కళ్యాణ్ తీన్మార్ సినిమాలో సెకండ్ హీరోయిన్ కృతి కర్బంద గుర్తుండే ఉంటుంది..సెలబ్రిటీ అవ్వక ముందు నుండే తను కొన్ని భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని, వాటి వివరాలు చెప్పుకొచ్చింది ఈ భామ. కృతి కర్బంద కేవలం హిందీలోనే కాదు..పలు సౌత్ ఇండియన్ భాషల్లో కూడా సినిమాలు చేసింది. అలాగే ఒక కన్నడ చిత్రంలో నటిస్తున్న సమయంలో..
తనతో పాటు, తన టీమ్ కూడా హోటల్ రూమ్‌లో ఒక కెమెరాను కనిపెట్టారని బయటపెట్టింది కృతి. ఆ ఘటనను గుర్తు చేసుకుంటూ ‘నేను ఒక కన్నడ సినిమా షూట్ చేస్తున్న సమయంలో హోటల్‌లో ఓ అబ్బాయి పని చేస్తుండేవాడు. అతడు ఒకసారి నా రూమ్‌లో కెమెరాను వదిలేశాడు. నా స్టాఫ్‌కు, నాకు చుట్టు పక్కన అంతా పరీక్షగా చూసే అలవాటు ఉంది. ఆ అబ్బాయికి అలవాటు లేకపోవడంతో కెమెరాను సరిగ్గా పెట్టలేదు. దానిని సెట్ టాప్ బాక్స్‌పైన పెట్టాడు. నాకు కనిపించింది. ఇలాంటి సంఘటనలు చాలా భయాన్ని కలిగిస్తాయి’’ అంటూ కృతి చెప్పుకొచ్చింది..!!