తెలుగులో చివరిగా శర్వా నంద్ తో ‘మనమే’ సినిమాలో నటించింది. మళ్ళీ ఇన్నాళ్ళకి బేబమ్మ తెలుగులో ఒక ప్రాజెక్ట్ కి ఫిక్స్ అయినట్లు టాక్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో ఒక మూవీకి కృతి ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ మధ్య హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా విశ్వక్ సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన లైలా మూవీ డిజాస్టర్ కావటంతో ఈ సారి కొంచెం శ్రద్ద పెట్టి కథ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానరులో విశ్వక్ చేసే మూవీలో హీరోయిన్ గా కృతిశెట్టిని ఫైనల్ చేసినట్లు సమాచారం..ప్రస్తుతం సితార ఎంటర్టైన్ మెంట్ ఫుల్ ఫామ్ లో ఉంది. ఏ ప్రాజెక్ట్ చేసినా హిట్ అందుకుంటు న్నారు. ఈ క్రమంలో ఫ్లాప్ లో ఉన్న కృతికి ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి. ఈ మూవీ హిట్ అయితే బేబమ్మ మళ్ళీ తెలుగులో బిజీ అయ్యే చాన్సలున్నాయి. అందం, అభినయం, గ్లామర్ ఒలకబోత అన్ని ఉన్నా అమ్మడికి లక్ కలిసిరాలేదు. ఇప్పడు సితార బ్యానర్ కృతిని గట్టెక్కిస్తుంది ఏమో చూడాలి..!!