వంద కోట్ల సినిమా ‘ఉప్పెన’తో ఆమె కథానాయికగా పరిచయం అయింది. తొలి సినిమాలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకోవడం, సినిమా కూడా పెద్ద హిట్టవడంతో ఆమెకు అవకాశాలు వరుసకట్టాయి. తెలుగులో రెండో చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ కూడా హిట్టవడంతో ఆమెకు డిమాండ్ పెరిగింది. చూస్తుండగానే పారితోషకం రెండు కోట్లు దాటిపోయింది. కానీ ఎంత వేగంగా రైజ్ అయిందో అంతే వేగంగా కింద పడింది కృతి. మూడో చిత్రం ‘బంగార్రాజు’ యావరేజ్‌గా ఆడగా..
తర్వాత చేసిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఆమెకు డిమాండ్ పడిపోయింది. అవకాశాలు ఆగిపోయాయి. ఏడాది పాటు తెలుగులో ఒక్క కొత్త సినిమా కూడా ఒప్పుకోలేదు కృతి. ఈ మధ్యే శర్వానంద్ సినిమా ‘మనమే’లో ఓ కథానాయికగా ఛాన్స్ దక్కించుకుంది. తనపై ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర పడడంతో గ్లామర్ ఫొటో షూట్లు చేస్తూ సెక్సీగా కనిపించడానికి కూడా సిద్ధమని చాటుతోంది కృతి. అయినా ఆమెకు ఛాన్సుల్లేవు..!!