in

Krithi Shetty: ‘I Saw a Ghost in My Hotel Room’

యువ కథానాయిక కృతి శెట్టి తనకు ఎదురైన ఓ వింత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు రోజు రాత్రి, తన హోటల్ గదిలో ఒక ఆత్మను చూశానని ఆమె వెల్లడించారు. తమిళ నటుడు కార్తి హీరోగా, నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వా వాత్తియార్’ చిత్రంలో కృతి శెట్టి నటిస్తున్నారు.

ఈ సినిమాలో ఆమె ఆత్మలతో మాట్లాడే ఒక జిప్సీ యువతి పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్ర గురించి మాట్లాడుతూ, “ఈ సినిమా షూటింగ్ మొదలవడానికి ముందు రోజు రాత్రి నాకో వింత అనుభవం ఎదురైంది. మా అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఒక ఆత్మ రూపాన్ని చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చి అది మాయమైంది. ఆ ఆత్మ నాకు సహాయం చేయడానికి వచ్చిందో లేక పాత్ర కోసం నేను చేస్తున్న సాధన వల్ల వచ్చిందో తెలియదు” అని కృతి తెలిపారు..!!

bhagyshree still waiting for a solid hit in telugu!