డెబ్యూతోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకోవడం అందరికీ జరగదు. ఉప్పెన వచ్చినప్పుడు హీరోయిన్ కృతి శెట్టి ఇండస్ట్రీలోనే కాదు యూత్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. దెబ్బకు డిమాండ్ అమాంతం పెరిగిపోయి దర్శక నిర్మాతలు క్యూ కట్టేశారు. ఇప్పుడు శ్రీలీల ఏదైతే స్టార్ డం చూస్తుందో దాని అంతకు ముందే కృతి ఎంజాయ్ చేసింది. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సక్సెస్ ల తర్వాత తనకిక తిరుగే లేదనుకున్నారు. కట్ చేస్తే వరసగా నాలుగు డిజాస్టర్లు పడి మార్కెట్ ని బాగా తగ్గించాయి. తాజాగా ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ తీవ్రంగా నిరాశపరిచింది.
దీనికన్నా ముందు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం మూడూ ఒకదాన్ని మించి మరొకటి దెబ్బ కొట్టాయి. మధ్యలో తమిళ స్టార్ హీరో సూర్యకు జోడిగా బాలా దర్శకత్వంలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ కొద్దిరోజులకే ఆగిపోయి క్యాన్సిల్ కావడం మరో ట్విస్ట్. ఒకవేళ అది పూర్తయ్యి ఉంటే కోలీవుడ్ లో గుర్తింపుతో పాటు బాలా కాబట్టి నటన పరంగా ఛాలెంజ్ ఉన్న క్యారెక్టర్ దక్కేది. అదీ మిస్ అయ్యింది. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో శర్వానంద్ హీరోగా రూపొందుతున్న చిత్రం మీదే తన ఆశలన్నీ..!!