
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి గారు ఇండస్ట్రీ లొ నిలదొక్కుకునే ప్రయత్నంలో ఎంత కష్టపడ్డారో బహుశా చాల కొద్దీ మందికే తెలిసిన విషయం ఇది. ఆయన సినీ జర్నీ లొ జరిగిన ఒక సంఘటన గని మీకు తెలుస్తే కచ్చితంగా షాక్ తిని ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఒక రోజు చాలా నీరసంగా ఉండి కింద ఫుట్ పాత్ మీద పడిపోయేవారట వంశీ గారు. అక్కడే ఉన్న బ్రహ్మాజీ గారు అది గ్రహించి వంశి గారి వద్దకు వెళ్లి జరిగిందేంటో తెలుసుకున్నారు. అసలు సంగతి ఏంటంటే వంశి గారి వద్ద డబ్బులు లేక తిండి తినకుండా ఐదు రోజులు నుండి పస్తులు ఉన్నారట అందుకే నిరసించిపోయాను అని చెప్పారు బ్రహ్మాజీ గారితో. అది విన్న బ్రహ్మాజీ గారు ‘రా వంశి ఇద్దరం కలిసి తిందాం’ అని చెప్పి తనవద్ద ఉన్న క్యారేజ్ నుండి వంశి కి భోజనం పెట్టారట. తరువాత కొన్నాళ్లకి సింధూరం సినిమా డైరేక్షన్ వచ్చింది వంశి గారికి. ఆ ఛాన్స్ రాగానే తన మైండ్ లొ వచ్చిన మొదటి వ్యక్తి బ్రహ్మాజీ, కచ్చితంగా నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఆయనని సినిమాలో పెట్టుకోవాలని ఛాన్స్ ఇచ్చారట వంశి గారు.. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా తొలి సినిమా ఛాన్స్ రావడానికి ఎంత కష్టపడతారో చెప్పడానికి వంశి గారి జీవితం లొ జరిగిన ఈ సంఘటన మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

