చాల మంది నిర్మాతల కొడుకులు హీరోలు అయ్యారు,కొంత మంది సక్సెస్ అయ్యారు కొంత మంది బొక్క బోర్లా పడ్డారు. సక్సెస్ అయిన వారిలో హీరో వెంకటేష్ గారు ఒకరు. కృష్ణ గారు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సినిమా రిజెక్ట్ చేయటం వలన హీరో ఛాన్స్ వచ్చిన వెంకటేష్. కృష్ణ గారి తో రామ నాయుడు గారు ఒక సినిమా ప్లాన్ చేసుకొని సెట్స్ మీదకు వెళ్లే సమయానికి బిజీ షెడ్యూల్ వలన ఆ సినిమా చేయలేనని కబురు చేసారు కృష్ణ గారు. అప్పటికే అన్ని ఆరెంజిమెంట్స్ చేసుకున్న రామ నాయుడు గారికి ఏమి చేయాలో పాలు పోలేదు, వెంటనే అమెరికాలో చదువు పూర్తి చేసిన వెంకటేష్ గారిని ఇండియా పిలిపించారు.
దర్శకుడు రాఘవేంద్ర రావు గారు రెడీ గ ఉన్నారు, సత్యానంద్ గారికి చెప్పి ఒక యంగ్ హీరో కు సరిపడే స్టోరీ రెడీ చేయ మన్నారు, వెంకటేష్ హైదరాబాద్ లో అడుగు పెట్టగానే , ప్రెస్ మీట్ పెట్టి తన చిన్న కుమారుడు హీరో గ సినిమా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించేసారు. ఆ విధంగా తయారయిన సినిమానే “కలియుగ పాండవులు”. సినిమా సక్సెస్ అయింది, దక్షిణాది తొలి నిర్మాత కొడుకు హీరో గ తెరంగేట్రం చేయటం జరిగిపోయింది. ఆ తరువాత చాలా మంది నిర్మాతలు తమ కుమారులను హీరోలు చేసారు.