in

Krack effect- Action scenes in ‘Khiladi’ to be more special!

రోనా సమయంలో 50 పర్సెంట్ ఆక్యూపెన్సీ తో కూడాక్రాక్  ఇండస్ట్రీ హిట్ గా నిలవడం గొప్ప విషయం. ఈ సినిమా కి వచ్చిన వసూళ్ళు కూడా ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇక ఈ సినిమాతో రవితేజ కి వచ్చిన సక్సస్ అండ్ క్రెడిట్ అంతా ఇంతా కాదు. దాంతో ప్రస్తుతం ఖిలాడి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

అయితే క్రాక్ సినిమాకి ముందు రవితేజ ట్రాక్ రికార్డ్ బాగా లేకపోవడం తో అనుకున్న బడ్జెట్ కంటే తగ్గించి ఖిలాడి సినిమాని తెరకెక్కించాలనుకున్నారు. కానీ క్రాక్ హిట్ తో ఇప్పుడు రవితేజ మార్కెట్ పెరిగింది. దాంతో ఇప్పుడు ఖిలాడి బడ్జెట్ ని పెంచినట్టు తెలుస్తోంది. భారీ యాక్షన్స్ ని తెరకెక్కించనున్నారు. అందుకే ఇప్పుడు అనుకున్నదానికంటే బడ్జెట్ డబుల్ చేసినట్టు సమాచారం. నిర్మాతలు కూడా ఇప్పుడు రవితేజ కి వచ్చిన క్రేజ్ కారణంగా బడ్జెట్ కి వెనకాడడం లేదని చెప్పుకుంటున్నారు..

Satya Dev bags a special role in Chiranjeevi’s ‘Lucifer’ remake!

‘Naandhi’ Trailer, Allari Naresh, Varalaxmi Sarathkumar!