in

kota gari jeevitamlo jarigina vishada sanghatana!

విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు గారి జీవితం లో జరిగిన అత్యంత విషాదమయిన ఘటన ఆయన ఏకైక కుమారుడి హఠాత్ మరణం, ఆయనను కుదిపేసింది. ఏ తండ్రికి అయినా తానుండగానే తన కుమారుడు మరణించటం జీర్ణించుకొలేని విషయం. కోట గారికి, హీరో జగపతి బాబు గారికి కొంత సాన్నిహిత్యం ఉంది, దాని మూలంగా కోట గారి కుమారుడిని నటుడిగా ప్రోత్సహించి, గాయం 2 సినిమాలో అవకాశం ఇప్పించారు జగపతి బాబు. ఆ చిత్రంలో పాత్ర పరంగా కోట గారి కుమారుడిని చంపి, అయన ఇంటి ముందు పడేసి వెళ్లే సీన్ షూట్ చేస్తున్నారు,

అప్పుడు కోట గారు జగపతి బాబు తో మా వాడిని ఆలా చూడటం నాకు కొంచెం ఇబ్బంది గ ఉందండి, అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారట. ఆ సంఘటన జరిగిన సరిగ్గా వారానికి, భార్య, పిల్లలు వెనుక కారులో వస్తుండగా, ఔటర్ రింగ్ రోడ్ లో తనకు ఇష్టమయిన రేసింగ్ బైక్ నడుపుతూ ప్రమాదానికి గురి అయి కోట గారి కుమారుడు మరణించటం జరిగింది. ఏదైతే షూటింగ్ లో చూడటానికి ఇబ్బంది పడ్డారో, అదే సంఘటన వాస్తవం లో చూడవలసి రావటం నిజంగా చాల బాధాకరం, దురదృష్టకరం.

Bigg boss 5: reasons why Lahari eliminated!

daksha nagarkar stills at a press meet!