in

KONA VENKAT GARI PRANALU KAAPADINA OKA AMMAI!

కోన వెంకట్, మంచి గుర్తింపు ఉన్న సినీ రచయిత, నిర్మాత, డైరెక్టర్ అండ్ నటుడు, ఆయనను ఆత్మ హత్యా ప్రయత్నం నుంచి కాపాడిన ఒక అమ్మాయి.ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథ మొత్తం వినాల్సిందే, అర్ యు” రెడీ “?. 1997 లో అప్పుడే సినీ వనం లో వాలిన ఒక కొత్త పిట్ట, (కోన వెంకట్)” తోకలేని పిట్ట ” అనే సినిమా తీసింది, ఆ దెబ్బకు తోకే కాదు ఈకలు కూడా రాలిపోయాయి.ఆ చిత్రం డిసాస్టర్ అవడం తో ఉన్నవి అన్ని అమ్ముకొని, దాదాపుగా రోడ్ మీదకు వచ్చేసారు వెంకట్ గారు.

ఫ్యూచర్ ఏమిటో తెలియదు, రాంగోపాల్ వర్మ తో ఉన్న స్నేహం కొద్దీ ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పారు, అయన బొంబాయి నుంచి రావటానికి టైం కుదరటం లేదు, ఇక్కడ వెంకట్ గారి పరిస్థితి ఘోరమయిన డిప్రెషన్ లో ఉన్నారు, ఎంతకు రాని రాము గారు, రేపేంటో తెలియని స్థితి, వెంకట్ గారిని ఆత్మ హత్య కు ప్రేరేపించింది. ఒక 50 కాంపోస్ టాబ్లెట్స్, ఒక వాటర్ బాటిల్ తీసుకొని మద్రాస్ మెరీనా బీచ్ కు వెళ్లి కూర్చున్నారు, గతం కళ్ళ ముందు మెదులుతుంది, కళ్ళలో సన్నటి కన్నీటి తెర, ఎదురుగా రెండు కాళ్లు, చేతులు, లేని ఒక చిన్న అమ్మాయి ఒక తోపుడు బండి మీద కూర్చొని ఎవరో నెడుతుంటే, హుషారుగా తన బండికి కట్టి ఉన్న బెలూన్స్ అమ్ముతూ చలాకీగా కనిపించింది, ఆ పాపను చూడగానే తన నిర్ణయం ఎంత తప్పో వెంకట్ గారికి అర్ధం అయింది, జేబులోని టాబ్లెట్స్ ప్రక్కన పడేసి నడుచుకుంటూ తిరిగి రూమ్ కి వెళ్లిపోయారు, తెల్లవారగానే రాము గారు వచ్చారు,ఆర్.జి.వి. ఫ్యాక్టరీ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గ తన ప్రయాణం మొదలు పెట్టి, ఇప్పటి కె.ఎఫ్.సి.(కోన వెంకట్ ఫిలిమ్స్) వరకు సాగింది. 54 చిత్రాల రైటర్ ని మనకు ఇచ్చిన ఆ అజ్ఞాత దేవత ను కలవటానికి ప్రయత్నించినా, మళ్ళీ ఆ పాపా కనిపించలేదట, దేవ దూతలు అంతే అనుకున్నపుడల్లా కనిపించరు.

29 YEARS FOR ‘PELLI PUSTHAKAM’!

KANGANA SHOCKING COMMENTS!