in

‘Kissik Girl’ Sreeleela Replaces Triptii dimri in Kartik Aaryan’s film?

ప్రస్తుతం శ్రీలీల తెలుగులో అగ్రతారల సరసన నటిస్తూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్‌‌‌తో నటించి అందరినీ మెప్పించారు. ఇప్పుడు ఆ ఐటెం సాంగే తన జీవితాన్ని మార్చేసింది. వరుస అవకాశాలు వచ్చేలా చేస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే అగ్రతారల సరసన నటించి స్టార్ హీరోయిన్‌లకు గట్టి పోటీగా నిలిచారు శ్రీలీల. ఇప్పుడు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు.

తాజాగా శ్రీలీల బాలీవుడ్‌లో భారీ ఆఫర్ దక్కించుకున్నారు. అగ్ర హీరో కార్తిక్ ఆర్యన్ సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేశారు. ఈ సినిమాకు అనురాగ్‌బసు దర్శకత్వం వహించనున్నారు. అయితే మొదట త్రిప్తి డిమ్రీని హీరోయిన్‌గా ఎంపిక చేయగా.. చివరి నిమిషంలో ఆమెను తప్పించి శ్రీలీలను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది..!!

actors suitable for specific genre movies!

Sai Pallavi wantedly skips ‘Thandel’ Promotions?