in

king nagarjuna nu bayapettina sridevi!

ప్రయోగాత్మక చిత్రాలు, ఆల్ టైం క్లాసిక్ సినిమాలను అలవోకగా చేసిన నాగార్జున కి ఒక హీరోయిన్ ని చూస్తే చాలా భయం వేసేది అట. ఎందుకంటే శ్రీదేవి నాగేశ్వర రావు ఎన్టీఆర్, కృష్ణ శోభన్ బాబు లాంటి మహానటులతో నటించిన హీరోయిన్. ఆమె అనుభవం ముందు నాగార్జున చాలా చిన్నవాడు. అలాంటి నాగార్జున కి కెరీర్ ప్రారంభం లోనే ఆఖరి పోరాటం వంటి సినిమాలో నటించే అవకాశం దక్కింది. కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు శ్రీదేవి ని చూసి నాగార్జున భయపడుతూ ఉండేవాడట..

ఆమె ప్రతీ షాట్ ని సింగిల్ టేక్ లో చేసేది అట. నాగార్జున అప్పుడే ఇండస్ట్రీ లోకి కొత్తగా వచ్చిన హీరో, ఆ వేగాన్ని అందుకోవడం చాలా కష్టం. అలాంటిడి శ్రీదేవి తో సినిమా అంటే ఎలా ఉంటుందో అని భయపడ్డాడు అట. అయితే షూటింగ్ ప్రారంభం లో ఆమెని చూస్తే చాలా భయం వేసిందని, కాలం గడిచే కొద్దీ ఆమె తనకి అలవాటు అయ్యిందని. అలా ఆమెతో చేసిన మొదటి సినిమాతోనే మంచి పరిచయం ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో ‘గోవిందా గోవిందా’ అనే చిత్రం తెరకెక్కించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు..!!

Rajamouli Begins Shooting with Mahesh Babu and John Abraham?

Sai pallavi angry with fans taking photos without permission!