in

kiara advani to romance liger star in his next?

ప్రస్తుతం ఈ రౌడీ హీరో మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు కసరత్తులు చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్‏గా కనిపించనున్నాడు. అలాగే.. ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల కంప్లీట్ అయ్యింది.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఇదిలా ఉంటే.. లైగర్ సినిమా అనంతరం విజయ్ మరోసారి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే నటించనున్నాడు. డైరెక్టర్ పూరీ తెరకెక్కించబోయే జనగణమన సినిమాలోనూ విజయ్ నటించనున్నట్లుగా గతంలోనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే ఈ సినిమా కంటే ముందు విజయ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‏గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లుగా టాక్. ఇప్పటికే భరత్ అనే నేను.. వినయ విధేయ రామ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది కియారా.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ.. టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది..

‘I wanna reproduce you’, samantha gives strong counter to netizen!

director sukumar joins hands with megastar Chiranjeevi!