బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ లో కూడా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఇప్పటికే కియారా అద్వానీ చాలాకాలం సిద్దార్థ్ మల్హోత్రా తో డేటింగ్ చేస్తోంది అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ వార్తలపై ఈ జంట ఎప్పుడూ కూడా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.ఎప్పటికప్పుడు వారి ప్రేమ విషయాన్ని సీక్రెట్ గానే ఉంచుతూ వచ్చారు.
కానీ ఇద్దరూ కలిసి హాలిడే లొకేషన్స్ కి వెళ్లడం ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే వచ్చింది ఈ జంట.ఇక అంతే కాకుండా కియారా అద్వానీ కూడా చాలాసార్లు సిద్ధార్థ మల్హోత్రా ఇంటికి వెళ్లి అక్కడ దిగిన ఫోటోలను.. వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త బాగా వైరల్ గా మారాయి. ఇకపోతే తాజాగా వీరిద్దరూ తమ రిలేషన్ షిప్ ను బయటపెట్టాలని అనుకుంటున్నారట..
కొత్త సంవత్సరం సందర్భంగా ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది..కాకపోతే ఈ సంవత్సరం వీరిద్దరూ కలిసి నటించిన షేర్జా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ దగ్గరయ్యారని సమాచారం. ఏమైనా కత్రినా కైఫ్ లాగా ఈమె కూడా తన ప్రేమ వ్యవహారాన్ని ముందుగా బయటపెట్టకుండా.. ఒక్కసారిగా బయట పెట్టి ..పెళ్లి పీటలు ఎక్కి పెళ్లి చేసుకుంటుందో ఏమో అన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తూనే ఉండడం గమనార్హం.