in

Kiara Advani Considered For Indian Swimmer Bhakti Sharma’s Biopic!

స్పోర్ట్ స్టార్ లైఫ్‌ల‌లో ప్ర‌పంచానికి తెలియ‌ని కోణాల‌ను బ‌యోపిక్‌ల ద్వారా చూపిస్తున్నారు.  ఈ సినిమాల ప‌ట్ల ప్రేక్ష‌కులు ఆస‌క్తిని కనబరుస్తుండటంతో వీటిలో న‌టించేందుకు అగ్ర‌హీరోహీరోయిన్లు రెడీ అంటున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు క్రీడాకారుల బ‌యోపిక్‌లు వెండితెర‌పై వచ్చి పెద్ద విజయాల్ని సాధించాయి. మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.  తాజాగా మ‌రో స్పోర్ట్ స్టార్ బ‌యోపిక్‌కు రంగం సిద్ధ‌మవుతున్నట్లు తెలుస్తోంది.

అతి పిన్న వయసులో అంటార్కిటిక్ సముద్ర జలాల్లో రెండున్నర కిలోమీటర్లు ఈది ప్రపంచ రికార్డును సృష్టించింది ఇండియన్ స్విమ్మర్ భక్తి శర్మ. అంతేకాకుండా ఐదు మహాసముద్రాల్లో ఈది రికార్డులను నెలకొల్పింది.  ఆమె జీవితకథతో హిందీలో ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లూటేరా, రాజీ సినిమాలకు కథను అందించిన భవానీ అయ్యర్ ఈ బయోపిక్ రచనా బాధ్యతల్ని స్వీకరించినట్లు తెలిసింది. ఈ బయోపిక్ లో టైటిల్ పాత్రను బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ కియారా అద్వాణీ పోషించబోతున్నట్లు తెలిసింది.

ఆమెను కలిసిన దర్శకనిర్మాతలు కథను వినిపించినట్లు తెలిసింది. భక్తి శర్మ విజయంలో ఆమె తల్లి కీలక భూమిక పోషించింది. తల్లీకూతుళ్ల బంధాన్ని ప్రధానంగా ఆవిష్కరిస్తూ రాసిన కథ కావడంతో కియారా అద్వాణీ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ప్రొఫెషనల్ స్విమ్మింగ్ లో కియారా అద్వాణీ కొన్నాళ్లు శిక్షణ తీసుకోనున్నట్లు చెబుతున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో శంకర్, రామ్ చరణ్ కలయికలో రూపొందుతున్న సినిమాలో కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది..

Salman and Chiranjeevi to start shooting for ‘god father’ from today!

actress Archana gautham’s magic dint work in up elections!