కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు యశ్. అప్పటి నుంచి ఆచితూచి అడుగులేస్తున్న యశ్.. బాలీవుడ్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రామాయణ్‌లో నటించనున్నాడు. ఈ సినిమాలో యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కావడంతో ఈ పాత్రలో నటిస్తున్నందుకు గాను యశ్ ఏకంగా రూ.200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. దీంతో యశ్ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఒకవేళ ఇదే నిజమైతే విలన్‌గా ఇంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న హీరోగా యశ్ రికార్డ్ క్రియేట్ చేసినట్టే అంటున్నాయి సినీ వర్గాలు. నితీష్ తివారి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ‘రామాయణ్’ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోల రెమ్యునరేషన్ రూ.100, రూ.200 కోట్ల వరకు ఉంటోంది. ఇటీవల ఇండస్ట్రీ హిట్ కొట్టిన పుష్ప2 సినిమాకు అల్లు అర్జున్ రూ. 300 కోట్లు తీసకున్నారని టాక్..!!