in

ketika sharma special song in ntr neel film?

రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ భామ కెతిక శర్మ. అమ్మడు ఆ సినిమాలో చేసిన గ్లామర్ షోకి ఆడియన్స్ షాక్ అయ్యారు. ఐతే అది హిట్ పడి ఉంటే కెరీర్ మరోలా ఉండేది కానీ రొమాంటిక్ ఫ్లాప్ అవ్వడంతో కెతిక అంతగా క్రేజ్ తెచ్చుకోలేదు. ఆ నెక్స్ట్ నాగ శౌర్యతో అశ్వద్ధామ చేసినా అది సక్సెస్ అందుకోలేదు. వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమా చేసినా అది కూడా నిరుత్సాహపరిచింది. నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ అది దా సర్ ప్రైజ్ అంటూ సర్ ప్రైజ్ చేసింది కెతిక శర్మ.

ఆ సాంగ్ తో కాస్త బజ్ ఏర్పరచుకోగా రీసెంట్ గా శ్రీవిష్ణుతో చేసిన సింగిల్ సినిమా అమ్మడికి కెరీర్ లో మొదటి హిట్ ఇచ్చింది..ఇదే ఊపులో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా కెతిక స్పెషల్ సాంగ్ కి సెలెక్ట్ అయ్యిందని చెబుతున్నారు. ఎన్టీఆర్ లాంటి స్టార్ సినిమాలో కెతిక ఛాన్స్ పట్టేస్తే మాత్రం అమ్మడి పంట పండినట్టే లెక్క. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందులో కెతిక కూడా భాగం అయితే మాత్రం ఆమె కెరీర్ కి మంచి బూస్ట్ ఇస్తుందని చెప్పొచ్చు..!!

dil raju sensational comments on buying youtube views!

HAPPY BIRTHDAY KORATALA SIVA!