ఇండస్ట్రీలో ఒక్కొక్కరూ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటివరకు నాగచైతన్య పెళ్లి సందడి జరిగింది ఇకపై కీర్తి సురేష్ పెళ్లి హడావిడి ప్రారంభం అవ్వబోతుంది. ఎందుకంటే ఆమె పెళ్లి డిసెంబర్ 12న జరగబోతుందని అందరికీ తెలిసిందే. తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ అయిన ఆంథోనితో ఏడు అడుగులు వేయబోతున్న కీర్తి సురేష్ గురించి ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది.
అదేమిటంటే తన పెళ్లి విషయంలో ఆమె సమంతని ఫాలో అవుతున్నట్లు సమాచారం. సమంత లాగే కీర్తి సురేష్ కూడా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటుందంట. సమంత అటు క్రిస్టియన్ వివాహ సంప్రదాయం ప్రకారం ఇటు హిందూ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి చేసుకుంది, అలాగే కీర్తి సురేష్ కూడా రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. డిసెంబర్ 12న ఉదయం కీర్తి సురేష్ మెడలో ఆంటోనీ తాళికట్టబోతున్నాడు..!!