దక్షిణాది చిత్రాలలో సత్తా చాటిన కీర్తి సురేశ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘బేబీ జాన్’ తో ఆమె బాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. తమిళ చిత్రం ‘తెరి’ సినిమాకు రీమేక్ గా ‘బేబీ జాన్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో తనకు అవకాశం రావడంపై కీర్తి సురేశ్ మాట్లాడుతూ..సమంత వల్లే తనకు ఈ మూవీలో ఛాన్స్ వచ్చిందని తెలిపింది..
‘తెరి’ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని చిత్ర బృందం భావించగానే సమంత తన పేరును సూచించిందని కీర్తి సురేశ్ వెల్లడించింది. తమిళంలో సమంత పోషించిన పాత్రను హిందీలో తాను చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సినిమా కోసం సమంత తన పేరు చెప్పగానే తాను భయపడ్డానని..అయితే సమంత తనకు ఎంతో మద్దతు ఇచ్చిందని పేర్కొంది. సమంత ఇచ్చిన ధైర్యంతోనే సినిమాను పూర్తి చేశానని తెలిపింది..!!