in

Keerthy Suresh out of Yellamma for this reason?

లగం’ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వేణు యెల్దండి, తన నెక్స్ట్ చిత్రాన్ని ‘ఎల్గమ్మ’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదట ఈ ప్రాజెక్ట్‌లో నాని లేదా నితిన్ వంటి అగ్ర హీరోలు నటిస్తారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో మహానటి కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో నటించడానికి ఎంతో ఆసక్తి చూపించారు. కానీ, హీరో ఎంపికలో మార్పులు జరగడం, చివరకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఈ ప్రాజెక్ట్ లోకి రావడంతో సమీకరణాలు మారిపోయాయి..

​తాజా సమాచారం ప్రకారం, దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తుండటంతో కీర్తి సురేష్ ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ లీడ్ రోల్ ప్లే చేస్తున్న పక్షంలో తాను ఈ బోర్డులోకి రావడానికి సిద్ధంగా లేనని ఆమె నిర్మాతలకు సున్నితంగా తెలియజేసినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి కీర్తి తప్పుకోవడం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు, దేవి శ్రీ ప్రసాద్ తన మొదటి సినిమా కోసం హీరోగా తనను తాను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ప్రస్తుతం ‘ఎల్లమ్మ’ బృందం హీరోయిన్ వేటలో పడింది. ఈ పాత్ర చాలా కీలకం కావడంతో సాయి పల్లవి వంటి నటనకు ప్రాధాన్యమున్న నటీమణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది..!!

Ustaad Bhagat Singh!

here is the much awaited update on Anushka Shetty’s kathanar!