in

keerthy suresh focused only on bollywood now?

పెళ్లయ్యాక సినిమాలు చేయడం అనేది మొత్తానికి మానేస్తారు లేదా చేసే సినిమాల జోనర్లు మారిపోతాయి. ఆఖరికి సమంతకి కూడా తప్పలేదు. ఇప్పుడు కీర్తి సురేష్ పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన కీర్తి సురేష్, పెళ్లి తర్వాత రకరకాల సినిమాలు సైన్ చేసింది అంటూ వార్తలు వచ్చాయి కానీ ఎందులోనూ నిజం లేదని తర్వాత తెలిసింది..

అయితే..పెళ్లి అనంతరం కీర్తి సురేష్ సైన్ చేసిన మొట్టమొదటి సినిమా ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. బాలీవుడ్ లో ప్రస్తుతం నటుడిగా మంచి ఫామ్ లో ఉన్న రాజ్ కుమార్ రావు హీరోగా రూపొందనున్న ఓ రీజనల్ డ్రామా ఫిలిం సైన్ చేసింది కీర్తి సురేష్. ఈ తరహా చిత్రాల్లో ఎక్స్ పోజింగ్ కానీ ఇబ్బందికరమైన డ్యాన్సులు కానీ ఉండవు. సో, కీర్తి సురేష్ కూడా పెళ్లి తర్వాత తన పంథా మార్చిందనే అనుకోవాలి..!!

meenakshi chaudhary opens up about ms dhoni