గత కొంతకాలంగా కీర్తి సురేష్ కి వరుస అపజయాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ప్రయోగాత్మక సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు సినిమాలకు చాలా దూరంగా ఉంటుంది. కేవలం కోలీవుడ్ సినిమాలలోనే నటిస్తోంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మహానటి అసలు తెలుగు జనాలను పట్టించుకోవడమే మానేసింది. అయితే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఇటీవల ఓ స్టార్ హీరోకి బాగా దగ్గరయిందట..
ఎంతలా అంటే ఆ స్టార్ హీరోతో నైట్ అవుట్ లు, పార్టీలు, పబ్ లు అంటూ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత అతనితో ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతుందట. అయితే ఈ విషయం తెలుసుకున్న కీర్తి సురేష్ ఫ్రెండ్ అయిన తెలుగు హీరో నేరుగా కీర్తి ఇంటికి వెళ్లి, అది కూడా వాళ్ళ అమ్మగారి ముందే సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. అక్కడి కల్చర్ కి ఎడిక్ట్ అయితే పరువు పోతుందని, ఓ ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నానని ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడట. దీంతో కీర్తి సురేష్ తల్లి సైతం ఆ తెలుగు హీరోకి సపోర్ట్ చేసి కీర్తి సురేష్ కి వార్నింగ్ ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!