
యూనిసెఫ్ (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) ఇండియా విభాగానికి ఆమె సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమితులయ్యారు. ఈ కొత్త బాధ్యతలు చేపట్టడం పట్ల కీర్తి సురేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు..ఈ నియామకంపై యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ మాట్లాడుతూ.. ‘‘కీర్తి సురేశ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది..
ప్రేక్షకులతో ఆమెకున్న బలమైన అనుబంధం, పిల్లల హక్కులు, వారి శ్రేయస్సు కోసం పోరాడటానికి బలమైన వేదిక అవుతుందని విశ్వసిస్తున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు. అనంతరం కీర్తి మాట్లాడుతూ..‘‘ప్రతి చిన్నారికి సంతోషంగా, ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. వారి నేపథ్యంతో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేలా అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ ఇండియాతో చేతులు కలపడం గౌరవంగా ఉంది’’ అని కృతజ్ఞతలు తెలిపారు..!!

