in

keerthy suresh bags another bollywood biggie?

నిన్న మొన్నటి వరకు హోమ్లీ ఇమేజ్‌తో ఉన్న కీర్తి..ఇప్పుడు హాట్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతోంది. బాలీవుడ్ కోసం హోమ్లీ ఇమేజ్‌ను పూర్తిగా పక్కకు పెట్టేసినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి బేబీ జాన్ అనే హిందీ సినిమాలో నటిస్తోంది కీర్తి సురేష్. కాలీస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళ్ ‘తేరీ’ రీమేక్‌గా తెరకెక్కుతోంది. మే 31న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ మూవీలో కీర్తి గ్లామర్ ట్రీట్ కాస్త గట్టిగానే ఉంటుందని అంటున్నారు.

ఇప్పటికే లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక్కడి నుంచి కీర్తి పూర్తిగా గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసినట్టేనని అంటున్నారు. బేబీ జాన్ హిట్ అయితే.. కీర్తికి మరిన్ని బాలీవుడ్ ఆఫర్లు రావడం పక్కా అంటున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్‌కు ముందే బాలీవుడ్ బడా హీరోతో ఛాన్స్ కొట్టేసినట్టుగా సమాచారం. బాలీవుడ్ పై గట్టిగా ఫోకస్ చేసిన కీర్తి..అక్షయ్ కుమార్‌తో ఆఫర్ అందుకుందని టాక్..!!

Top 10 Most Followed Tollywood Actors on Instagram!

WHO KNOWS, HOW AND WHEN LUCK HUGS!!