
తెలుగు సినీ పరిశ్రమలో కీరవాణిగా, తమిళ్, మలయాళం పరిశ్రమలో మరకతమని గ, హిందీ పరిశ్రమలో ఎం.ఎం. క్రీమ్ గ గుర్తింపు పొందిన బహు భాష సంగీత దర్శకుడు, మూడు దశాబ్దాల సినీ ప్రయాణం లో దాదాపు 240 సినిమాలు, 1400 పైగా పాటలు చేసిన కీరవాణి గారిని ఒక ఇంటర్వ్యూ లో మీకు ఇష్టమయిన స్పిరిట్యుయల్ సాంగ్ ఏది అని అడిగితే అయన చెప్పిన సాంగ్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఏమనుకుంటున్నారు? ఎ అన్నమయ్య సినిమాలో పాటో, లేక రామదాసు లోని పాటో అనుకుంటున్నారా,అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే! కీరవాణి గారి దృష్టిలో స్పిరిట్యుయల్ అంటే మనిషిని జాగృతం చేసి, కర్తవ్యం ఏమిటో గుర్తు చేసేది అని. దానికి అనుగుణం గ అయన చెప్పిన పాట ఏమిటో తెలిస్తే మీరు కూడా ఎస్ హి ఇస్ రైట్ అంటారు. యెన్.టి.ఆర్. డైరెక్ట్ చేసిన శ్రీ కృష్ణ పాండవీయం సినిమా లో, మారు వేషం లో వచ్చిన కృష్ణుడు, నిద్రిస్తున్న భీముడిని మెలోకొల్పుతూ పాడే, ” మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, జీవితమున సగ భాగము నిద్దురకే సరిపోవునురా, మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేక పోవు,అతి నిద్ర లోలుడు తెలివి లేని మూర్ఖుడు, పరమార్ధం కాన లేక వ్యర్ధంగా చెడతాడు, మత్తు వదలరా” అనే పాట. జీవిత పరమార్ధాన్ని బోధించే ఈ పాట ను స్పిరిట్యుయల్ సాంగ్ గ పేర్కొన్నారు. ఇప్పుడు మీరు కూడా కీరవాణి గారి తో ఏకీభవిస్తారు అనుకుంట

