in

kayadu lohar officially onboard for nani’s paradise!

నేచరల్ స్టార్ నాని, దసరా ఫేం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతోన్న హై ఎనర్జీ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. ఈ మూవీలో హీరోయిన్‌ను ఇప్పటి వరకూ అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. తాజాగా, ఆ హీరోయిన్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో నాని సరసన యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ నటించనున్నారు. సుబ్బలక్ష్మి పాత్రలో ఆమె నటిస్తుండగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మట్టి మనుషుల మధ్య సైకిల్‌పై క్యూట్ అండ్ కూల్‌గా వస్తున్న ఆమె లుక్ అదిరిపోయింది. ‘వెండితెరపై వెలగని తార. మీట్ సుబ్బు..సుబ్బలక్ష్మి ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ ది ప్యారడైజ్.’ అంటూ రాసుకొచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతుండగా…నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు..!!

Cyber Crime Case Filed Against telugu anchor Vishnu priya!