in

Kayadu Lohar in High Demand, Signs 2 telugu Films!

సినిమా సినిమాకీ త‌మ పారితోషికాన్ని పెంచుకుంటూనే ఉంటారు. కొత్త‌మ్మాయి క‌యాదు లోహ‌ర్ కూడా ఈ జాబితాలో చేరుతుందేమో అనిపిస్తోంది. డ‌బ్బింగ్ సినిమా ‘డ్రాగ‌న్‌’తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని గెలుచుకొంది క‌యాదు. ఆ సినిమాతోనే తెలుగులోనూ ఆఫ‌ర్లు అందుకొంది. ప్ర‌స్తుతం ‘పార‌డైజ్‌’లో న‌టిస్తోంది. తను హీరోయిన్‌గా చేసిన ‘ఫంకీ’ ఇటీవ‌లే విడుద‌లైంది..

ఈ సినిమా ఫ్లాప్‌. అయినా స‌రే, స్క్రీన్ ప్రెజెన్స్ లో తన మార్క్ చూపించింది క‌యాదు. అందుకే పారితోషికం కూడా పెంచేసింది. ‘ఫంకీ’కి గానూ క‌యాదు రూ.60 ల‌క్ష‌లు మాత్ర‌మే తీసుకొంద‌ని స‌మాచారం. ఇప్పుడు కోటి అడుగుతోంద‌ట‌. ఇటీవ‌ల ఓ నిర్మాత క‌యాదును సంప్ర‌దిస్తే ‘కోటి త‌గ్గితే సినిమా చేయ‌ను’ అనేసింద‌ని టాక్‌. ఈ ష‌ర‌తుమీదే కొత్త‌గా రెండు సినిమాల్ని ఒప్పుకొంద‌ని స‌మాచారం. యూత్ హీరోల సినిమాల్లో కయాదు మంచి ఆప్ష‌నే. సోష‌ల్ మీడియాలో కూడా త‌న‌కు మంచి ఫాలోయింగ్ ఉంది..!!

NTR, Neel Lucky Escape from Jordan tensed situations!

thalapathy vijay’s TVK party name linked with trisha’s name!