ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి” అనే పాత సామెతకు నిలువెత్తు నిదర్శనం “కత్తివీరుడు కాంత రావు” గారి జీవితం. యెన్.టి.ఆర్.,ఏ.యెన్.ఆర్. తరువాత అంతటి గొప్ప గుర్తింపు సంపాదించుకున్న హీరో టి.ఎల్. కాంత రావు గారు. అప్పట్లో వెండి తెర మీద కత్తి యుధ్ధాలు బాగా చేసేవారు కాబట్టి ఆయనకు ” ఆంధ్ర ఏం.జి.ఆర్.” అని” కత్తి వీరుడు” అని పేరు కూడా ఉండేది. పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా పేరయితే ఉండేది గానీ, అయన మృదు స్వభావి కావటం తో ఆర్ధికం గ చాలా ఇబ్బందులు పడ్డారు.ఆయన ఇబ్బందులలో ఉన్న టైములో ఇన్కమ్ టాక్స్ వారి దృష్టి అయన మీద పడింది, ఇంత వరకు మనం “ఆంధ్ర ఏం.జి.ఆర్. మీద దాడి చేయలేదు కదా ఒక సారి రైడ్ చేద్దాము అని కాంత రావు గారి ఇంటికి వచ్చారట.
ఇన్కమ్ టాక్స్ వారిని చూసిన అయన, ఓరి మీ దుంపతెగ నా దగ్గర ఎముందని వచ్చారు, చెక్ చేసుకోండి అన్నారట, వచ్చిన వారి తనిఖీ పూర్తి అయినా తరువాత, ఇప్పుడు అర్ధం అయిందా మీ ఆంధ్ర ఏం.జి.ఆర్. పరిస్థితి అంటూ, మధ్యాహ్నం పిల్లలకు భోజనం క్యారియర్ తెప్పించి పెట్టి వెళ్ళండి, అది నా పరిస్థితి అన్నారట. ఆయన దీన పరిస్థితి కి చలించిపోయి వచ్చిన ఆఫీసర్స్ అందరు తమ జేబులోని డబ్బులు తీసి అయన చేతిలో పెట్టి వెళ్లిపోయారట. ఇటువంటి పరిస్థితి పగవాడి కి కూడా రాకూడదు అని కోరుకొందాం, ఆయన మంచితనమే ఆయనకు శాపం అయింది.