ప్రముఖ నటుడు చిరంజీవి, హరిప్రసాద్ మరియు నారాయణరావులతో కలసి సుధాకర్ ఒకే గదిలో ఉండేవారు. అప్పటికి దర్శకుడు భారతీరాజా సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నరు. ఆయన్ని కలిసిన సుధాకర్ ను హీరోగా సిఫార్స్ చేయగా సుధాకర్, రాధికలను పరిచయం చేస్తూ హీరో, హీరోయిన్ గా ‘కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్’ సినిమా రూపొందించారు. ఆ సినిమా హిట్ అయింది. దీంతో తమిళంలో పలు విజయవంతమైన సినిమాల్లో నటించి పెద్ద నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. కొన్ని అనుకోని కారణాలతో తమిళ పరిశ్రమ నుంచి తెలుగు సినీ పరిశ్రమకి వచ్చిన సుధాకర్ ఇక్కడ సహాయ నటుడిగా..హాస్య నటుడుగా స్థిరపడాల్సి వచ్చింది..పలు చిత్రాల్లో విలన్ గా, హాస్య నటుడుగా, సహాయ నటుడు గా నటించిన సుధాకర్ నిర్మాత గా మారి మూడు సినిమలను కూడా నిర్మించారు.
కాగా సుధాకర్ చివరిగా నటించిన సినిమా సంక్రాంతి. సుధాకర్ 2014 మే నెలలో ఒక ఇంటర్వ్యు లో మాట్లాడుతూ తెలుగు సినిమాకు నేను దూరంగా లేను, నన్నే తెలుగు సినిమా ఇండస్ట్రీ దూరంగా ఉంచుతుందని బాధపడ్డారు. దాదాపు 600 చిత్రాలలకు పైగా నటించిన ప్రముఖ హాస్య నటుడు కమెడియన్ సుధాకర్ ఇప్పుడు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. వయసు మీద పడుతుండడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా పెద్దగా బాగోలేదు ఇప్పుడు..ఇలాంటి సమయంలో కూడా ఛాన్స్ ఇస్తే తిరిగి మళ్లీ నటించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు..కానీ ఎవరు ఆయన వైపు చూడడం లేదట..ఇది నిజంగా చాలా బాధాకరం..ఇండస్ట్రీ కు చెందిన ఒక మంచి ప్రతిభావంతుడైన నటుడు సుధాకర్ గారిని మనం ఇలా చూడడం.