in

kannappa beauty Preity Mukundan joins vijay’s ‘Rowdy Janardhan’!

విజయ్ హీరోగా దర్శకుడు రవి కిరణ్‌ కోలా తెరకెక్కించనున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేశారట. ఈ సాంగ్ కోసం కన్నప్ప ఫేమ్ ‘ప్రీతి ముకుందన్’ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఈ సాంగ్ తో పాటు ఓ చిన్న పాత్రలో కూడా కనిపిస్తోందట. మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ప్రీతి ముకుందన్.

మరి ఇప్పుడు విజయ్ దేవరకొండతో స్టెప్స్ వేయడానికి రెడీ అవుతుంది ఈ యంగ్ బ్యూటీ. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటించనుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయట..!!

young sensation Bhagyashri Borse bags a biggie!