ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవాలని ప్రయత్నించిన చాలామంది నటులు భంగపడ్డారు. రష్మిక లాంటి హీరోయిన్ నటిస్తే ప్రాజెక్టుకు పాన్ ఇండియా అప్పీల్ వస్తోంది. కన్నడ సినిమాలు ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా లెవెల్లో మెరుస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో కన్నడ సినిమాలు చేసేందుకు ఆమె ఇంట్రెస్ట్ చూపించకపోవడం అక్కడ మేకర్స్ కు కోపం తెప్పించింది..దీనికితోడు తన సినిమాలకు డబ్బింగ్ కూడా ఆమె చెప్పడం లేదంట. ఆమె నటించిన తెలుగు, తమిళ సినిమాలు కన్నడలో రిలీజ్ అవుతుంటే, వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించాల్సి వస్తోందట.
ఇవన్నీ ఒకెత్తయితే, బాలీవుడ్ మీడియాకు చెందిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక, తనను హీరోయిన్ గా పరిచయం చేసిన బ్యానర్, హీరో పేరు చెప్పలేదు. ఇది కూడా కన్నడ నాట చాలామందికి కోపం తెప్పించింది..దీంతో కన్నడ చిత్రసీమకు చెందిన కొన్ని సంస్థలు రష్మికను బ్యాన్ చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె సినిమాలు కన్నడనాట రిలీజ్ కాకుండా నిషేధం విధించేలా పావులు కదుపుతోంది. ఇదే కనుక కార్యరూపం దాలిస్తే, ఆమె చేస్తున్న పుష్ప-2, వారసుడు సినిమాలకు కన్నడనాట ఇబ్బందులు తప్పవు..!!