in

kanche beauty pragya jaiswal ‘Condition’ For Lip Kiss!

డేటింగ్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. నచ్చిన వ్యక్తి దొరికితే కొన్నాళ్లు డేటింగ్ చేసి నచ్చితే పెళ్లి వరకు వెళ్తారు. లేదంటే ఒకరికొకరు గుడ్ బై చెప్పుకొని విడిపోతారు. చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు డేటింగ్ చేస్తున్నారు. అయితే డేటింగ్ పై ఒక్కో హీరోయిన్ కు ఒక్కో అభిప్రాయం ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా నటి ప్రగ్యా జైస్వాల్ కి డేటింగ్ కి సంబంధించిన ఓ ప్రశ్న ఎదురైంది. ఎవరితోనైనా డేటింగ్ చేస్తే.. మొదటి రోజే లిప్ కిస్ పెడతారా..? అనే ప్రశ్నకు ప్రగ్యా నో చెప్పింది. మొదటిరోజే ముద్దు పెట్టడం తనకు ఇష్టం ఉండదని..

కొన్ని రోజుల తరువాత మనసులు కలిసి తరువాత లిప్ కిస్ పెట్టడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతోంది. ఇక లాక్ డౌన్ తరువాత తొలిసారి సినిమా సెట్స్ పై అడుగుపెట్టింది ప్రగ్యా. ప్రస్తుతం ఆమె బాలకృష్ణతో కలిసి ‘అఖండ’ సినిమా చేస్తోంది. సెకండ్ వేవ్ తరువాత తొలిసారి సెట్స్ పైకి వచ్చినప్పుడు చాలా భయం వేసిందని..దాదాపు 200 మంది ఉన్నారని.. అందరూ మాస్క్ లు పెట్టుకున్నప్పటికీ ఎందుకో భయం ఉండేదని చెప్పుకొచ్చారు. ఎప్పుడైతే షూటింగ్ వాతావరణంలోకి వెళ్లిపోతామో.. అప్పుడిక కరోనా ఉండనే విషయాన్నే మర్చిపోతున్నానని అన్నారు.

A biopic on Dasari Narayana Rao: ‘Darsakaratna’

Malavika Mohanan Sizzling in Green outfits!