కమెడియన్ ప్రియదర్శి నటించిన మెయిల్ ఆహా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్ట్ ఆహాలో రిలీజైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. గ్రామీణ ప్రాంత నేపథ్యంలో సాగుతుంది. కొత్తగా కంప్యూటర్లు వచ్చిన 2000సంవత్సర మొదట్లో సాగిన కథ ఇది. హాస్యం, ప్రేమ మిళితమై చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందులో హైబత్ పాత్రలో ఊర్లో చిన్న పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి గేమింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాడు ప్రియదర్శి.
అదే ఊరిలో ఒక కాలేజీ కుర్రాడు కంప్యుటర్ నేర్చుకోవాలని ఆశపడతాడు. అతడు కంప్యూటర్ ఎలా నేర్చుకున్నాడు? ఏం జరిగింది? దాని చుట్టూ జరిగిన హాస్య సన్నివేశాలు ఏంటన్నదే కథ. ఐతే ప్రస్తుతం ఈ సినిమాకి అరుదైన ఘనత దక్కింది. న్యూయార్క్ ఫిలిమ్ ఫెస్టివల్ 2021కి ఈ సినిమా ఎంపికైంది. ఈ విషయాన్ని స్వప్నా సినిమా బ్యానర్ అధికారికంగా ప్రకటించింది. న్యూయార్క్ ఫిలిమ్ ఫెస్టివర్ జూన్ 4వ తేదీ నుండి మొదలవుతుంది..