in

Kamalinee Mukherjee reveals the reason to quit telugu movies!

నంద్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, తొలి సినిమాతోనే అందరి మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నటి కమలినీ ముఖర్జీ. ఆ తర్వాత ‘గోదావరి’, ‘గమ్యం’ వంటి చిత్రాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, దాదాపు దశాబ్ద కాలంగా ఆమె తెలుగు సినిమాల్లో కనిపించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఇన్నేళ్లు టాలీవుడ్‌కు దూరం కావడానికి గల అసలు కారణాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఒక తెలుగు సినిమాలో తాను పోషించిన పాత్రను తెరపై చిత్రీకరించిన విధానం తనకు తీవ్ర నిరాశను కలిగించిందని కమలినీ తెలిపారు. ఆ పాత్రను తాను ఊహించుకున్న దానికి, తెరపై చూపించిన దానికి మధ్య చాలా తేడా ఉందని, ఆ అసంతృప్తితోనే తెలుగు సినిమాల్లో నటించడం మానేశానని ఆమె స్పష్టం చేశారు. ఆ ఒక్క సంఘటన తనను బాగా బాధపెట్టిందని, అందుకే టాలీవుడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు..!!

samantha still tops on remuneration for item songs!