చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అని కమల్ హాసన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఇప్పటికే ఈ విషయంపై కమల్ హాసన్ స్పందిస్తూ తన మాటలను తప్పుగా అపార్థం చేసుకున్నారు అంటూ వివరణ కూడా ఇచ్చారు..
మరోవైపు కన్నడిగులు క్షమాపణలు చెప్పాల్సిందే లేదంటే సినిమాను ఆపేస్తాం విడుదల కానివ్వం అంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. తన వ్యాఖ్యలను కమల్ సమర్ధించుకోవడంతో కన్నడిగులు ఆగ్రహం మరింత ఎక్కువైంది. కర్ణాటకలో కన్నడ సంఘాలు, అభిమానులు నిరసనలు చేపట్టారు. థగ్ లైఫ్ సినిమా బ్యానర్లను చించివేయడం, కమల్ దిష్టిబొమ్మలను దహనం చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి..!!