అటు తలైవా రజినీకాంత్, ఇటు యూనివర్సల్ హీరో కమల్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా సూపర్ న్యూస్. వీరిద్దరి కాంబోలో ఓ మల్టీస్టారర్ రాబోతోందని గత కొంతకాలంగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన సైమా వేడుకలో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు కమల్. తాను రజినీకాంత్ ఓ మూవీ చేయబోతున్నట్లు చెప్పారు..
‘మీరు, రజినీకాంత్ కాంబో మల్టీ స్టారర్ ఆశించవచ్చా?’ అంటూ ఎదురైన ప్రశ్నకు కమల్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. ‘ఆడియన్స్ మా కాంబోను ఇష్టపడితే అది చాలా మంచిదే. మేమిద్దరం కలిసి ఓ మూవీలో నటించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ ఇన్ని రోజులూ అది కుదరలేదు. త్వరలోనే ఓ మల్టీస్టారర్‌తో మీ ముందుకు రాబోతున్నాం. ఈ మూవీ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది’ అంటూ చెప్పారు. అయితే, డైరెక్టర్ ఎవరు ఏ బ్యాక్ డ్రాప్‌లో మూవీ ఉంటుంది అనే వివరాలను ఆయన షేర్ చేసుకోలేదు..!!