in

kalyani dating superstar’s son?

‌లో చిత్రంతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ బ్యూటీ క‌ళ్యాణి ప్రియద‌ర్శిని. ఆ త‌ర్వాత చిత్ర‌ల‌హ‌రి, ర‌ణ‌రంగం చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ప‌లు త‌మిళ చిత్రాలు కూడా చేసింది. ఈ న‌టి సూప‌ర్ స్టార్ కుమారుడితో డేటింగ్ లో ఉన్న‌ట్టు ఓ వార్త ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. మ‌లయాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కుమారుడు ప్ర‌ణ‌వ్ తో క‌ళ్యాణి ప్రియద‌ర్శిని డేటింగ్ లో ఉంద‌నే వార్తసోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే ఈ వార్త‌ల‌పై క‌ళ్యాణి ప్రియ‌దర్శిని నుంచి ఎలాంటి స్పంద‌న లేదు. మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని డేటింగ్ న్యూస్ గురించి ఇపుడు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు నిజ‌ముంద‌నే విష‌యంపై క్లారిటీ రావాల్సి ఉంది. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో ఓ సినిమాతోపాటు తమిళంలో రెండు చిత్రాలు చేస్తోంది.

prabhas next 3 movies rs 900 crores!

rakul’s amazing cycling skills!