కళ్ళు చెదిరే గ్రాఫిక్స్, విజువల్స్ తో మహాభారతాన్ని ఈ తరం వాళ్లకు అర్ధం అయ్యేలా చూపించిన నాగ్ అశ్విన్ కు ఎన్ని థాంక్స్ లు చెప్పినా తక్కువే. సినిమాలో కొన్ని పొరపాట్లు ఉన్నా థియేటర్లో వాటి గురించి ఆలోచించకుండా ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్నారు. కానీ, దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం కల్కి లో చేసిన తప్పులను అందరి ముందు ఒప్పుకుని వాటిని మీడియా ముందు వివరించాడు.
ఇటీవల కల్కి సెట్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సమయంలో కొన్ని చోట్ల తప్పులు జరిగాయని చెప్పాడు. మహానటి మూవీలో డబ్బింగ్ మాదిరిగానే ఈ మూవీలో కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పించాం. కానీ, సినిమా క్లెమాక్స్ హడావుడిలో అనుకున్న ఫినిషింగ్ ఇవ్వలేకపోయా అని నాకు అనిపించిందంటూ నాగ్ అశ్విన్ చెప్పాడు. నాకు ఎలా ఉంటుందంటే పాత్ర ఎవరు చేస్తే వల్లే డబ్బింగ్ చెబితే వంద శాతం ఫెర్సెక్ అని నాకు అనిపిస్తుంది..!!