in

Kalki 2 Shocker: Deepika Padukone’s Exit

దీపికా పదుకొనే అవుట్ అఫ్ ప్రభాస్ ‘కల్కి 2’
దీపిక‌ను తొలగించిన వైనం వెనుక చాలా కొత్త కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. క‌ల్కి 1 చేస్తున్న‌ప్పుడు దీపిక రూ.9 కోట్ల వ‌ర‌కూ పారితోషికం తీసుకొంద‌ని స‌మాచారం. ఇప్పుడు ఆ పారితోషికాన్ని డ‌బుల్ చేయాల‌ని చూసింద‌ట‌. క‌నీసం రూ.13 కోట్లు ఇస్తే గానీ, నేను ఈ సినిమాలో న‌టించ‌ను అని ఖ‌రాఖండీగా చెప్పేసింద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.
ప్రభాస్ ‘కల్కి 2’ నుండి దీపికా పదుకొనే అవుట్!
దీపిక పారితోషికం భ‌రించ‌డం వైజ‌యంతీ మూవీస్ లాంటి సంస్థ‌కు భారం కాక‌పోవొచ్చు..కానీ దీపిక అసెస్టెంట్ల‌ను భ‌రించ‌డం మాత్రం ఎవ్వ‌రికైనా ఇబ్బందే. ఎందుకంటే దీపిక వెనుక దాదాపు 25 మంది స్టాఫ్ ఉంటార‌ని స‌మాచారం. మేక‌ప్ అసిస్టెంట్లు, హెయిర్ డ్ర‌స్స‌ర్‌, కాస్టూమ్ అసిస్టెంట్స్, పర్స‌న‌ల్ మేనేజ‌ర్‌, బౌన్స‌ర్స్..
‘స్పిరిట్’ తరువాత ‘కల్కి 2’ నుండి దీపికా పదుకొనే తొలిగింపు!
ఇలా దీపిక క‌దిలితే వెనుక పాతిక మంది స‌మూహం ఉంటుంద‌ట‌. వాళ్లంద‌రి జీత‌భ‌త్యాలు, బేటాలు, హోటెల్ రూములు అన్నీ నిర్మాణ సంస్థే భ‌రించాలి. షూటింగ్ జ‌రిగిన‌న్ని రోజులు ఈ పాతిక మంది ని చూసుకోవాలంటే అద‌నంగా క‌నీసం రూ.4 కోట్ల‌యినా అవుతుంద‌ని తెలుస్తుంది.!!

happy birthday vennela kishore!

Janhvi Kapoor breaks silence on her wedding plans!