కళా తపస్వి విశ్వనాధ్ గారు దర్శకుడిగా ఎదిగాక, మరో దర్శకుడి దగ్గర ఒక్క రోజయిన అసిస్టెంట్ డైరెక్టర్ గ పని చేయాలి అని కోరుకున్నారు, ఎవరా దర్శకుడు? ఏమిటి ఆయన గొప్ప తనం? విశ్వనాధ్ గారు తన చిత్రాలలో కొన్ని సామజిక సమస్యల మీద తనదైన శైలిలో పరిష్కారాలు చెప్పటానికి ప్రయత్నించే వారు. అదే శైలిలో తమిళ దర్శకుడు బాలచందర్ గారు కూడా కొన్ని సామాజికి రుగ్మతల మీద తనదైన శైలిలో చిత్రాలు తీసే వారు. 1974 లో విశ్వనాధ్ గారు, చంద్ర మోహన్, రోజా రమణి హీరో, హీరోయిన్లు గ తీసిన చిత్రం ” ఓ సీత కధ”, ఈ చిత్రంలో ఒక విభిన్నమయిన కధాంశం ను విశ్వనాథ గారు స్పృసించటం జరిగింది, విమర్శకుల ప్రశంశలు అందుకున్న చిత్రం ఓ సీత కధ, ఏన్నొ అవార్డులు సాధించింది. సమాజంలో ఒక చర్చకు దారి తీసిన సినిమా. ఈ చిత్రం హక్కులు తీసుకొన్న బాలచందర్ గారు తమిళ్ లో శ్రీదేవి, కమల్ హాసన్ , రజనీకాంత్ తో ” మూండ్రు ముడిచు” అనే పేరుతో చిత్రంని రీమేక్ చేసారు. బాల చందర్ గారు.
కధలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి, తనదైన ట్రీట్మెంట్ తో చిత్రం నిర్మించి రిలీజ్ చేశారు, ఆ చిత్రం తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది, ఈ సినిమా వీక్షించిన విశ్వనాధ్ గారు తన కధకు బాల చందర్ ఇచ్చిన ట్రీట్మెంట్ చూసి, ముగ్ధులు అయ్యారు, ఇంతటి ప్రతిభ కలిగిన దర్శకుడి వద్ద ఒక రోజయిన అసిస్టెంట్ గ పని చేయాలి అంటూ నేరుగా బాల చందర్ గారి వద్దే తన కోరికను వెలిబుచ్చారట విశ్వనాథ్ గారు. వాహిని సంస్థ లో సౌండ్ ఇంజినీర్ గ కెరీర్ ప్రారంభించి , ఆదుర్తి సుబ్బా రావు గారి వద్ద అసిస్టెంట్ చేసి, దర్శకుడిగా పరిణితి చెందిన విశ్వనాథ్ గారు, ఆలా బాల చందర్ గారి వద్ద అసిస్టెంట్ గ పని చేయాలి అనుకునేంతగా ఆ చిత్రం లో ఏమి చేసారు అనేది, ఈ రెండు చిత్రాలు చూస్తే తప్ప మనకు అర్ధం కాదు, కాబట్టి వీలయితే చూడండి.వీరిద్దరి మధ్య ఇంకొక సిమిలారిటీ ఉన్నది, ఇద్దరు బ్రాహ్మణ సామజిక వర్గానికి చెందిన వారే కానీ, వీరు తీసిన సినిమాల వలన వారి సొంత సామజిక వర్గం చేత విమర్శించబడిన వారే. కళకు కులం, మతం, ఏమిటి మీ స్యార్థం అంటూ, చివరి వరకు తమ శైలిలోనే సాగిపోయిన ధన్యజీవులు, మన విశ్వనాథ గారు, బాల చందర్ గారు..!!